Megastar Chiranjeevi | ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ‘నాటు నాటు’ పాట గొల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకోవడం పట్ల మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశాడు. మిమ్మల్ని చూసి దేశం గర్విస్తుందని సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపాడు. ‘ఇదొక అద్భుతమైన,చారిత్రక విజయం. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘నాటు నాటు’ పాటకి కీరవాణి గోల్డెన్ గ్లోబ్ అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌కు నా అభినందనలు. దేశం మిమ్మల్ని చూసి గర్విస్తుంది. సంగీతం, డ్యాన్స్.. ఈ రెండింటి సెలబ్రెషనే ‘నాటు నాటు’. మన దేశమే కాదు ప్రపంచం మొత్తం ఈ రోజు మీతో కలిసి డ్యాన్స్ చేస్తుంది. చరణ్, తారక్‌తో పాటు అద్భుతమైన సాహిత్యం అందించిన చంద్రబోస్, ఉర్రూతలూగించేలా ఆలిపించిన రాహుల్, కాలభైరవ, కొరియాగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్‌కు కంగ్రాంట్స్ అంటూ ట్విట్టర్ వేదికగా టీమ్ మొత్తానికి అభినందనలు తెలిపాడు.
#NaatuNaatu is all about the celebration of Music 🎶 & Dance 🕺
India & the World is dancing with you today!!Kudos @tarak9999 @AlwaysRamCharan @boselyricist for the fabulous lyrics!@kaalabhairava7 @Rahulsipligunj
Danayya garu @DVVMovies @goldenglobes #GoldenGlobes pic.twitter.com/U77CjQclyC— Chiranjeevi Konidela (@KChiruTweets) January 11, 2023
చిరంజీవితో పాటు నాగార్జున, మోహన్ బాబు, దేవి శ్రీ ప్రసాద్, అనుష్క శెట్టి, మంచు విష్ణు, రవితేజ, రాహుల్ రవింద్రన్, నందినీ రెడ్డి సహా పలువురు ఆర్ఆర్ఆర్ టీమ్‌కు అభినందనలు తెలుపుతున్నారు.
టాలీవుడ్ టాప్ దర్శకుడు రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా చరిత్ర సృష్టించింది. ప్రపంచ చలన చిత్ర రంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డును (Golden Globe Awards) దక్కించుకుంది. సినిమాలోని ‘నాటునాటు’ పాట.. ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఉత్తమ పాటగా ఎంపికైంది. కాలిఫోర్నియాలోని ది బెవర్లీ హిల్టన్ హాల్ వేదికగా జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్, కీరవాణి కుటుంబసమేతంగా … Read More>>