Chiru In london | అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి లండన్ చేరుకున్నాడు. నాలుగు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో అందించిన విశేష సేవలకు గుర్తింపుగా యూకే ప్రభుత్వం ఆయనకు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే.. యూకే అధికార లేబర్ పార్టీ ఎంపీ నవేందు మిశ్రా ఆధ్వర్యంలో మార్చి 19న ఈ సన్మాన కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా చిరు నేడు లండన్ చేరుకున్నాడు. ఇక మెగాస్టార్ రాకతో లండన్ ఎయిర్‌పోర్ట్‌లో అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మెగాస్టార్ మెగాస్టార్ అంటూ ఎయిర్పోర్ట్ వద్ద సందడి చేశారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం చిరు విశ్వంభర అనే సైన్స్ ఫిక్షన్, మైథలాజీ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తుండగా.. త్రిష కథానాయికగా నటిస్తుంది. ఇదే కాకుండా దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలాతో కొత్త ప్రాజెక్ట్ అలాగే అనిల్ రావిపూడితో మరో ప్రాజెక్ట్ చేయనున్నాడు చిరంజీవి.
Megastar #Chiranjeevi garu receives a warm welcome from fans at #Heathrow today! He will be honoured with the ‘Lifetime Achievement Award’ for excellence in public service through cultural leadership on 19 March 2025.@KChiruTweets pic.twitter.com/WzIScQJNMv
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) March 18, 2025