Megastar Chairanjeevi | టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి తన కొడుకు రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. చరణ్ నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ ఆర్సీ16. ఈ ప్రాజెక్ట్‌ను పెద్ది అనే టైటిల్‌ను ఖారరు చేశారు మేకర్స్. ఈ సందర్భంగా మూవీ నుంచి ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. అయితే ఈ ఫస్ట్‌లుక్‌పై మెగాస్టార్ స్పందిస్తూ.. పెద్ది ఫస్ట్ లుక్ చూస్తుంటే చాలా శక్తివంతంగా కనిపిస్తోంది. ఈ చిత్రం నీలోని నటుడిని ఒక కొత్త కోణంలో ఆవిష్కరిస్తుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఇది సినీ ప్రేమికులకు, అభిమానులకు ఒక కనులపండుగగా ఉంటుంది!! దీన్ని అద్భుతంగా తీసుకురా. అంటూ చిరు రాసుకోచ్చాడు.
పెద్ది సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాకు ‘ఉప్పెన’ఫేం బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తుండగా.. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. మైత్రీమూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో, వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ పాన్ఇండియా ప్రాజెక్ట్‌లో కన్నడ చక్రవర్తి శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్‌లో మున్నాభాయ్యగా నటించిన దివ్యేందు శర్మ ఇందులో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు.
Happy Birthday
My dear @AlwaysRamCharan !💐💐 Many Many Happy Returns!! 🤗 #Peddi looks very intense and I am sure it will bring out a new dimension of the Actor in you and will be a feast for Cinema lovers and Fans!! Bring it on!!! 😍— Chiranjeevi Konidela (@KChiruTweets) March 27, 2025