హర్షసాయి స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘మెగా’. ‘డాన్’ ఉపశీర్షిక. మిత్ర కథానాయికగా నటిస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. ఆదివారం టీజర్, టైటిల్ను అనౌన్స్ చేశారు. హర్షసాయి మాట్లాడుతూ-‘ఇది భిన్నమైన నేపథ్యంలో సాగే కథ. ఓ కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులు చూస్తారు’ అన్నారు. ‘కల్వకుంట్ల వంశీధర్రావుగారు చాలా సపోర్ట్ చేశారు.
ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. చిన్న ఆలోచనతో మొదలై భారీ స్థాయికి చేరిన సినిమా ఇది. ‘ఆదిపురుష్’కి పనిచేసిన డీవోపీ కార్తీక్ పళని ఈ సినిమాకు పనిచేశారు. హర్షసాయి ఈ సినిమాతో పెద్దహీరో అవుతాడు’ అని నిర్మాత చెప్పారు. వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ సినిమాకు సంగీతం: వికాస్ బాడిసా, నిర్మాణం: శ్రీ పిక్చర్స్.