Chiranjeevi | చిరంజీవి మాస్టర్ ప్లాన్.. ఒకేసారి ఆ రెండు సినిమాలు చేస్తున్నాడా..?
Chiranjeevi | చిరంజీవి జోరు చూస్తుంటే కుర్ర హీరోలకు కూడా కునుకు రావట్లేదు. అసలు ఏం చేస్తున్నాడో తెలియదు కానీ ఆర్నెళ్లకో సినిమా.. ఏడాదికి కచ్చితంగా రెండు సినిమాలు.. కుదిరితే మూడు సినిమాలు చేయాలని ఫిక్సయిపోయాడు మెగాస్టార్. అందుకే ఆయన ప్లానింగ్స్ కూడా అలాగే ఉన్నాయి.
Chiranjeevi | చిరంజీవి జోరు చూస్తుంటే కుర్ర హీరోలకు కూడా కునుకు రావట్లేదు. అసలు ఏం చేస్తున్నాడో తెలియదు కానీ ఆర్నెళ్లకో సినిమా.. ఏడాదికి కచ్చితంగా రెండు సినిమాలు.. కుదిరితే మూడు సినిమాలు చేయాలని ఫిక్సయిపోయాడు మెగాస్టార్. అందుకే ఆయన ప్లానింగ్స్ కూడా అలాగే ఉన్నాయి. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఉన్న కుర్ర దర్శకులందరికీ ఫజిల్స్ ఇచ్చేశాడు చిరు. తనకు నచ్చే కథ తీసకొచ్చిన వాళ్లకు వెంటనే సినిమా చేస్తానంటూ ఆఫర్ ఇచ్చాడు. దాంతో మెగాస్టార్‌తో సినిమా చేయాలని కోరిక ఉన్న ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా ఇప్పుడు అదే పనిమీద ఉన్నాడు. పైగా యంగ్ డైరెక్టర్స్ కోసం చిరు ఇంటి తలుపులు కూడా ఎప్పుడూ ఓపెన్ చేసే ఉన్నాయి. అందుకే ఆయనకు ఈ మధ్య కథలకు కొదవే లేకుండా పోతుంది.
అన్నింటికి మించి రీమేక్ సినిమాలు కూడా బాగానే చేస్తున్నాడు చిరు. అవి వర్కవుట్ అవ్వట్లేదని తెలిసినా కూడా ఆయన మనసు మాత్రం అక్కడే ఉండిపోతుంది. ఎందుకంటే రీమేక్ కథలు అయితే ఎక్కువగా కంగారు పడాల్సిన అవసరం లేదు.. కష్టపడాల్సిన పనిలేదు.. మన ఇమేజ్‌కు తగ్గట్లు కథలో కొన్ని మార్పులు చేసుకుంటే చాలు. ఇప్పుడు భోళా శంకర్ విషయంలోనూ ఇదే చేస్తున్నాడు చిరు. ఆగస్ట్ 11న ఈ సినిమా విడుదల కానుంది. దీని తర్వాత వశిష్ట దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్లో ఓ సినిమా చేస్తున్నాడు చిరంజీవి. ముల్లోక వీరుడు అనే వర్కింగ్ టైటిల్ దీనికి పరిశీలిస్తున్నారు. పూర్తిగా సోషియో ఫాంటసీ స్టోరీ ఇది. దాంతో పాటు కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలోనూ ఓ సినిమాకు సై అనేశాడు చిరంజీవి. ఈ సినిమాకు ఆయన కూతురు సుష్మిత కొణిదెల నిర్మాత. కూతురు కోసం ఈ సినిమా చేస్తున్నాడు మెగాస్టార్.
అక్కడ రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక.. మలయాళంలో హిట్టయిన బ్రో డాడీ సినిమాను ఇక్కడ మనకు తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేసి చేయాలని చూస్తున్నాడు చిరు. దానికోసమే కళ్యాణ్ కృష్ణకు కథలో మార్పులు చేయాలంటూ సూచించారు. ఇందులో సిద్ధూ జొన్నలగడ్డ, శ్రీలీల మరో జంటగా నటించే అవకాశాలున్నాయి. చిరుకు జోడీగా త్రిష నటించబోతుందని తెలుస్తుంది. మొత్తానికి ఇటు వశిష్ట.. అటు కళ్యాణ్ సినిమాలను ఒకేసారి సెట్స్‌పైకి తీసుకురావడమే కాదు.. పూర్తి చేయాలని చూస్తున్నాడు మెగాస్టార్. అన్ని అనుకున్నట్లు జరిగితే కళ్యాణ్ కృష్ణ సినిమా సంక్రాంతికి.. వశిష్ట సినిమా 2024 సమ్మర్ తర్వాత విడుదల కావడం ఖాయం.
Read More :
Pawan kalyan | ఓజీలో బాలీవుడ్ రొమాంటిక్ హీరో.. పవన్ కళ్యాణ్ కోసం విలన్‌గా ఎంట్రీ !
Chiranjeevi | 20 ఏండ్ల తర్వాత మళ్లీ అలాంటి సాహసం చేస్తున్న చిరంజీవి?
Shilpa Shetty | శిల్పా శెట్టి నివాసంలో చోరీ : ఇద్దరిని అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
Horoscope | 21-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

