Varun tej about niharika | ‘నిహారిక చేస్తున్న సిరీస్‌లు, సినిమాల విషయంలో నేను ఎక్కువగా జోక్యం చేసుకోను. ఎప్పుడూ సలహాలు ఇవ్వను. ప్రయోగాత్మక ఇతివృత్తాలతో తనకంటూ సొంత గుర్తింపును తెచ్చుకోవాలని నిహారిక కష్టపడుతున్నది’ అని అన్నారు హీరో వరుణ్‌తేజ్. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ వెబ్‌సిరీస్ ప్రీ రిలీజ్ వేడుకకు వరుణ్‌తేజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంగీత్శోభన్, సిమ్రాన్శర్మ, సీనియర్ నరేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నిహారిక కొణిదెల నిర్మించారు. మహేష్ ఉప్పాల దర్శకుడు. ఈ నెల 19న జీ5 ఓటీటీ ద్వారా విడుదలకానుంది.
ఈ సందర్భంగా వరుణ్‌తేజ్ మాట్లాడుతూ ‘ట్రైలర్ బాగుంది. సంగీత్శోభన్ కామెడీ టైమింగ్, నటన బాగున్నాయి. ఓటీటీ మాధ్యమాల వల్ల ప్రతిభావంతులకు అవకాశాలు పెరిగాయి. క్వాలిటీ, కంటెంట్ పరంగా సినిమాలతో సమానంగా సిరీస్‌లు తెరకెక్కుతున్నాయి’ అన్నారు. ఈ సిరీస్ ద్వారా తాను ఓటీటీ ప్లాట్ఫామ్లోకి అరంగేట్రం చేయబోతున్నట్లు సీనియర్ నరేష్ చెప్పారు. నిహారిక కొణిదెల మాట్లాడుతూ ‘వినోదాత్మక కథాంశంతో తెరకెక్కుతున్న ఫ్యామిలీ డ్రామా ఇది. అవసరానికి మించి తీసుకున్న లోన్స్ వల్ల ఎలాంటి అనర్థాలు తలెత్తుతాయో అర్థవంతంగా ఇందులో చూపించాం. సంగీత్శోభన్, నరేష్, తులసితో పాటు ప్రతి పాత్రకు సమప్రాధాన్యత ఉంటుంది’ అని చెప్పింది. సినిమాగా భావించి కష్టపడి తాను పనిచేసిన సిరీస్ ఇదని సంగీత్శోభన్ అన్నారు. ఈ కార్యక్రమంలో మహేష్ ఉప్పాల, సిమ్రాన్శర్మ తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
తమన్నా స్పెషల్ సాంగ్..హాట్ టాపిక్ గా రెమ్యునరేషన్..!
జూనియర్ బన్నీ రెడీ.. అల్లు అయాన్ వీడియోకు అదిరిపోతున్న రెస్పాన్స్..
తన కంటే చిన్నవాడితో డేటింగ్‌పై రష్మిక ఏమన్నదంటే..?
Kangana Ranaut : కాంట్రవర్సీ క్వీన్ కంగనా.. సినిమాల కంటే వివాదాలే బోలెడు.. లిస్ట్ పెద్దదే
పవన్ కళ్యాణ్‌తో నితిన్ పోటీ.. తెలిసి చేశాడా.. తెలియక చేశాడా..?