Allu Arjun – Sai Dharam Tej | టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను మెగా హీరో సాయి ధరమ్ తేజ్ అన్‌ఫాలో చేసిన విషయం తెలిసిందే. బన్నీతోపాటు స్నేహారెడ్డిని అల్లు కుటుంబ సభ్యులను సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేశాడు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో అల్లు అర్జున్ పవన్ కల్యాణ్‌కు మద్దతునిస్తునే నంద్యాల వైసీపీ అభ్యర్థి కోసం మాత్రం ఇంటికి వెళ్లి మరీ ప్రచారం చేశారు. దీంతో ఈ విషయంపై నాగబాబు స్పందిస్తూ.. పరాయివాడు అంటూ ట్వీట్ చేసి డిలీట్ చేశాడు. దీంతో అప్పటినుంచి ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఇదే విషయంపై అల్లు అర్జున్ను అన్‌ఫాలో చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయంపై తాజాగా నిహరిక కొణిదెలా స్పందించింది. నిహరిక కొణిదెలా సమర్పణలో వస్తున్న తాజా చిత్రం కమిటీ కుర్రాళ్లు. ఈ సినిమా టీజర్ వేడుకలో పాల్గోన్న నిహరికను ఒక రిపోర్టర్ సాయితేజ్ – అల్లు అర్జున్ వివాదం విషయం అడుగగా ఆమె స్పందించింది.
నిహరిక మాట్లాడుతూ.. అల్లు అర్జున్ను సాయి ధరమ్ తేజ్ అన్‌ఫాలో చేసిన విషయం తనకు తెలియదని. ఎందుకు అన్‌ఫాలో చేశాడో.. ఎవరి కారణాలు వారికి ఉంటాయని చెప్పుకొచ్చారు.