అగ్రహీరో చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆదివారం చిత్రపురిలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హీరో శ్రీకాంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చిత్రపురి హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్‌కుమార్ మాట్లాడుతూ ‘రక్తదానం చేయడమంటే ప్రాణదానం చేసినట్లే. రక్తం అందక ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకోవడానికి ఈ క్యాంప్ ఉపయోగపడుతుంది’ అని తెలిపారు. సినీ కార్మికుల్ని ఎంతో ప్రేమించే చిరంజీవిగారి స్ఫూర్తితోనే ఈ శిబిరాన్ని ఏర్పాటుచేశామని కాదంబరి కిరణ్ అన్నారు.