Mega 154 | shruti hassan in chiranjeevi movie | మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈయన చేతిలో నాలుగైదు సినిమాలకు పైగానే ఉన్నాయి. ఇప్పటికే ఈయన నటించిన ఆచార్య సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. దీని తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమాలో నటించనున్నాడు. మోహన్ లాల్ హీరోగా వచ్చిన లూసిఫర్ అనే మలయాళ సినిమాకు ఇది రీమేక్. ఈ సినిమాతో పాటే భోళా శంకర్ సినిమాలో కూడా నటిస్తున్నాడు మెగాస్టార్. మెహర్ రమేశ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేశ్ నటిస్తోంది. అజిత్ హీరోగా వచ్చిన వేదాళం సినిమాకు ఇది రీమేక్. కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతుంది. రాఖీ పండుగ సందర్భంగా విడుదలైన ఈ సినిమా టీజర్ ఆకట్టుకుంది. ఇది కాకుండా చిరు బర్త్ డే సందర్భంగా మరో రెండు సినిమాల నుంచి కూడా అఫిషియల్ అనౌన్స్మెంట్స్ వచ్చాయి. వాటిల్లో చిరంజీవి 154 ( Mega 154 )వ చిత్రం కూడా ఉంది. ఈ సినిమాను జై లవకుశ ఫేం బాబీ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన సౌత్ ఫైర్ బ్రాండ్ హీరోయిన్ శ్రుతి హాసన్ ( Shrui haasan )ను తీసుకోవాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట.
ప్రస్తుతం సీనియర్ హీరోలకు హీరోయిన్లు దొరకడం కష్టంగా మారిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా చిరంజీవి వరుసగా సినిమాలను చేస్తుండటంతో ఈ సమస్య మరింత ఎక్కువైంది. చిరంజీవి కమ్ బ్యాక్ సినిమా ఖైదీ నంబర్ 150 సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత వచ్చిన సైరా నరసింహారెడ్డిలో నయనతార, తమన్నా నటించారు. కానీ ఆచార్య సినిమా వచ్చేసరికి మళ్లీ హీరోయిన్ సమస్య వచ్చింది. ఇప్పుడు ఉన్న హీరోయిన్లను తీసుకుంటే చిరంజీవి సరసన సూట్ అవ్వరు. దీంతో కొంతమంది హీరోయిన్లకే పరిమితం కావాల్సిన పరిస్థితి. అందుకే మళ్లీ కాజల్‌నే హీరోయిన్గా తీసుకున్నారు. లూసిఫర్ సినిమాలో హీరోయిన్ లేదు. భోళా శంకర్ సినిమాకు కూడా కథానాయిక సమస్య వచ్చింది. దీంతో సైరాలో నటించిన తమన్నాకే రెండో అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఇక మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో వస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాకు కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. దీంతో ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా బాలీవుడ్ హీరోయిన్ను తీసుకోవాలని అనుకున్నారు. ఈ సినిమా కోసం సోనాక్షి సిన్హాను తీసుకుంటున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ చివరకు శ్రుతి హాసన్‌కు దర్శకనిర్మాతలు ఫిక్సయినట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో శ్రుతి హాసన్ ఇప్పటికే శ్రీమంతుడు సినిమాలో నటించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
చిరంజీవి, రజినీకాంత్ సినిమాల మధ్య ఈ పోలికలు గమనించారా..?
Tamannah In Bhola Shankar | భోళా శంకర్‌లో తమన్నా..తాజా అప్డేట్
Shruti Haasan: బాయ్ ఫ్రెండ్‌తో డిన్నర్ డేట్.. ముంబైలో తళుక్కుమన్న శృతి
Shruti Haasan | 2020లో శృతిహాసన్ నేర్చుకున్న గొప్ప పాఠం ఇదే
Shruti Haasan: ప్రేమ, పెళ్లిపై నోరు విప్పిన శృతి హాసన్
shruti haasan | ఆ ప్రశ్న అడగొద్దు!