ఆ ప్రశ్న అడగొద్దు!

ఇటీవల సోషల్‌మీడియాలో అభిమానులతో ముచ్చటించింది తమిళ చిన్నది శృతిహాసన్. వారు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానమిచ్చింది. అయితే ఓ అభిమాని పెళ్లెప్పుడని అడగ్గా.. ప్రపంచమంతా కరోనా మహమ్మారి నుంచి విముక్తులు కావాలని శ్రమిస్తుంటే నా పెళ్లి వార్త కావాల్సి వచ్చిందా అంటూ చురకలంటించింది. ఈ సంక్షోభ సమయంలో దృష్టిపెట్టాల్సిన అంశాలు చాలా ఉన్నాయని, ప్రస్తుతం పెళ్లి గురించి ఎలాంటి ఆలోచన లేదని తేల్చిచెప్పింది. అసలు అలాంటి ప్రశ్నలు అడగొద్దని హెచ్చరించింది. ‘ఇప్పుడు మనముందు పరిష్కరించుకోవాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా కరోనా బారి నుంచి ప్రపంచమంతా బయటపడి సుఖసంతోషాలు వెల్లివిరియాలి. ఆ తర్వాతే మిగతా విషయాల గురించి ఆలోచిద్దాం’ అని శృతిహాసన్ చెప్పింది. ఇదిలావుండగా ప్రముఖ ఆర్టిస్టు శంతను హజారికాతో శృతిహాసన్ గత కొంతకాలంగా సన్నిహితంగా ఉంటోంది. వీరిద్దరి మధ్య స్నేహానికి మించిన అనుబంధం ఏదో ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం శృతిహాసన్ తెలుగులో ‘సలార్’ చిత్రంలో నటిస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

