ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తున్నది. సామాజిక మాధ్యమాలను ప్రపంచమంతా వాడేస్తున్నారు. ఈ క్రమంలో ఫేక్ ఐడీలు కూడా పుట్టుకొచ్చేస్తున్నాయి. ముఖ్యంగా ఫేమ్ ఉన్న వారి పేర్లతో ఐడీలను క్రియేట్ చేసే సైబర్ నేరగాళ్ల సంఖ్య కూడా భారీగా పెరిగిపోతున్నది. తాజాగా అగ్ర కథానాయిక మీనాక్షి చౌదరి కూడా ఈ ఫేక్ ఐడీ బారిన పడింది. తన పేరుతో ఎవరో ఫేక్ ఐడీని క్రియేట్ చేశారు.
దీనిపై ఆమె స్పందిస్తూ ‘ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నా పేరు, ఫొటో, ఫేక్ నంబర్‌తో ఫేక్ ఐడీని క్రియేట్ చేసి మోసాలకు తెగబడుతున్నట్టు నా దృష్టికి వచ్చింది. ఎవరికైనా ఈ ఫేక్ నంబర్‌తో కాల్ కానీ, మెసేజ్ కానీ వస్తే, వెంటనే రిపోర్ట్ చేయండి. ఇలాంటి ఫేక్ ఐడీల విషయంలో జనం అలెర్ట్‌గా ఉండాలి. లేకపోతే సర్వస్వం కోల్పోవాల్సి వస్తుంది’ అంటూ పేర్కొన్నది మీనాక్షి చౌదరి.