విజయ్ ‘గోట్’ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో కనిపించింది మీనాక్షి చౌదరి. సినిమా ఫలితం ఎలా వున్నా ఈ ముద్దుగుమ్మ అందచందాలకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. మెకానిక్ రాకీ, విశ్వంభర, లక్కీభాస్కర్, మట్కా.. ప్రస్తుతం మీనాక్షి చేతిలో ఉన్న సినిమాల లిస్ట్ ఇది. తెలుగులోనే కాక, ఇతర భాషల్లోనూ నిదానంగా బిజీ అవుతున్నది మీనాక్షి చౌదరి.
ఓ పక్క సినిమాలతో బిజీగా ఉంటూ మరో పక్క తన ఇస్టాగ్రామ్‌లో కొత్తకొత్త పోజులతో ఫొటోలను పోస్ట్ చేస్తూ, యువతకు కనులవిందు చేస్తున్నది ఈ హర్యానా అందాలభామ. రీసెంట్గా వైట్ అవుట్‌ఫిట్‌తో ఉన్న ఫొటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ ఫొటోల్లో సింపుల్‌గా కనిపించినా, ఆమె లుక్ దెబ్బకు అందరూ మత్రముగ్ధులవుతున్నారు.
అందుకు తగ్గట్టుగానే కామెంట్లు వస్తున్నాయి. దీనిపై మీనాక్షి స్పందిస్తూ ‘అందంగా కనిపించడంలో నేనెంత నిజాయితీగా ఉంటానో.. ఆ అందాన్ని అభినందించడంలో నా అభిమానులు కూడా అంతే నిజాయితీగా ఉంటారు. ఈ అభిమానం ఇలాగే ఉండాలని ఆశిస్తున్నా’ అని ఇన్‌స్టాలో షేర్ చేసింది మీనాక్షీ చౌదరి.