యువహీరో విశ్వక్సేన్ నటిస్తున్న యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ ‘మెకానిక్ రాకీ’. మీనాక్షి చౌదరి కథానాయిక. రవితేజ ముళ్లపూడి దర్శకుడు. రామ్ తాళ్లూరి నిర్మాత. దీపావళి కానుకగా అక్టోబర్ 31న సినిమా విడుదల కానుంది. ప్రచారంలో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన తొలి పాటకూ, ఇతర ప్రచార చిత్రాలకు మంచి స్పందన వస్తున్నది. ఈ నెల 18న ఈ సినిమాలోని సెకండ్ సింగల్ని మేకర్స్ విడుదల చేయనున్నారు. ‘ఓ పిల్లో..’ అంటూ సాగే ఈ పాట సినిమాకే హైలైట్గా నిలుస్తుందని, జెక్స్ బిజోయ్ స్వరపరిచిన ఈ పాటలో విశ్వక్సేన్, మీనాక్షి చౌదరిల లవ్లీ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ చెబుతున్నారు. శ్రద్ధా శ్రీనాథ్, నరేష్, వైవా హర్ష, హర్షవర్ధన్, రోడీస్ రఘురామ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మనోజ్ కటసాని, నిర్మాణం: ఎస్ఆర్టి ఎంటైర్టెన్మెంట్స్.