మణి సాయితేజ టైటిల్ రోల్లో కనిపిస్తున్న చిత్రం ‘మెకానిక్’. ట్రబుల్ షూటర్ అనేది ఉపశీర్షిక.ముని సహేకర దర్శకుడు. మున్నా (ఎమ్.నాగ మున్నెయ్య) నిర్మాత. ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను ఇటీవల ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘కమర్షియల్ వాల్యూస్‌తో అన్ని వర్గాల వారిని అలరించే అంశాలతో రూపొందుతున్న చిత్రమిది.
గ్రామీణ ప్రాంతంలో జరిగే ఒక బర్నింగ్ ప్రాబ్లం నేపథ్యంలో వినోదానికి పెద్ద పీట వేస్తూ సందేశాత్మకంగా తెరకెక్కిస్తున్నాం. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’ అన్నారు. రేఖ నిరోషా నాయికగా నటిస్తున్న చిత్రానికి సంగీతం: వినోద్ యజమాన్య.