ఇద్దరు స్నేహితులు కాలప్రయాణంలో రాజకీయ ప్రత్యర్థులుగా మారిన వైనాన్ని ఆవిష్కరిస్తూ రూపొందించిన వెబ్‌సిరీస్ ‘మయసభ’ ఆగస్ట్ 7 నుంచి సోనీలివ్‌లో స్ట్రీమింగ్కానుంది. దేవా కట్టా, కిరణ్ జయకుమార్ దర్శకత్వంలో విజయ్‌కృష్ణ లింగమనేని, శ్రీహర్ష రూపొందించారు. ఇందులో కాకర్ల కృష్ణమనాయుడు పాత్రలో ఆదిపినిశెట్టి, ఎం.ఎస్.రామిరెడ్డి పాత్రలో చైతన్య రావు, ఐరావతిబసు పాత్రలో దివ్యాదత్త నటించారు.
శనివారం ఈ సిరీస్ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. రాజకీయ చదరంగంలోని స్నేహం, ఎత్తుకుపై ఎత్తులు, ఆటుపోట్లను ఆవిష్కరిస్తూ ట్రైలర్ ఆకట్టుకుంది. సంభాషణలు ప్రధానాకర్షణగా నిలిచాయి. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుందని మేకర్స్ తెలిపారు.