బుధవారం 03 జూన్ 2020
Cinema - May 09, 2020 , 07:42:40

మే 9..మూడు బిగ్గెస్ట్ హిట్ చిత్రాల‌ని రిలీజ్ చేసిన వైజయంతి

మే 9..మూడు బిగ్గెస్ట్ హిట్ చిత్రాల‌ని రిలీజ్ చేసిన వైజయంతి

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో మ‌ర‌పురాని చిత్రాల‌ని ప్రేక్ష‌కుల‌కి అందించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వైజ‌యంతి మూవీస్‌. అశ్వినీద‌త్ నిర్మాణంలో టాలీవుడ్ టాప్ స్టార్స్ ప్ర‌ధాన పాత్ర‌లుగా అనేక హిట్ చిత్రాలు తెర‌కెక్కాయి. ఇందులో క్లాసిక‌ల్‌, యాక్ష‌న్, కామెడీ, సెంటిమెంట్ ఇలా ప‌లు జానర్స్ చిత్రాలు ఉన్నాయి. అయితే అశ్వినీద‌త్ 30 ఏళ్ల క్రితం మే 9న జ‌గ‌దేకవీరుడు అతిలోకసుంద‌రి అనే క్లాసిక‌ల్ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో రంజింప‌జేశారు. ఇక 2018 మే 9న మ‌హాన‌టి అనే చిత్రం తెర‌కెక్కించి నేష‌న‌ల్ అవార్డ్స్ అందుకున్నారు. ఇక మే 9, 2019న మ‌హ‌ర్షి అనే చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాగా ఈ చిత్రం భారీ విజ‌యం సాధించింది.

మే 9న అశ్వినీద‌త్ రిలీజ్ చేసిన చిత్రాల‌న్నీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ విజ‌యం సాధిస్తున్నాయి. గ‌త రెండు సంత్స‌రాలుగా మే 9న హిట్ చిత్రాల‌ని విడుద‌ల చేస్తూ వ‌స్తున్న అశ్వినీద‌త్ ఈ ఏడాది మాత్రం త‌మ బేన‌ర్ నుండి ఎలాంటి సినిమాలు రిలీజ్ చేయ‌డం లేదు. అయితే త్వ‌ర‌లో ప్ర‌భాస్ హీరోగా నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ బ‌డ్జెట్ చిత్రాన్ని పీరియాడిక‌ల్ మూవీగా తెర‌కెక్కించ‌నుండగా, ఈ మూవీ 2021 చివ‌ర‌లో లేదంటో 2022లో విడుద‌ల కానుంది. 


logo