కన్నడ అగ్రనటుడు కిచ్చా సుదీప్ కథానాయకుడిగా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘మాక్స్’ విజయ్ కార్తికేయ దర్శకుడు. కలైపులి ఎస్.థానుతో కలిసి కిచ్చా సుదీప్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణంలో ఉంది. మంగళవారం ఈ సినిమా టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఇందులో కిచ్చా సుదీప్ మాస్ అవతార్‌లో కనిపిస్తున్నారు.
యాక్షన్ లవర్స్ మెచ్చేలా ఈ సినిమా ఉంటుందని, ఇందులో కిచ్చా సుదీప్ డెమీ గాడ్ లుక్ అభిమానుల్ని ఆకట్టుకుంటుందని మేకర్స్ చెబుతున్నారు. వరలక్ష్మీశరత్‌కుమార్, సంయుక్త హూర్నాడ్, ప్రమోద్ శెట్టి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అజనీశ్ లోక్‌నాథ్, నిర్మాణం: వి.క్రియేషన్స్, కిచ్చా క్రియేషన్స్.