మెగా హీరో వరుణ్‌తేజ్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మట్కా’ విడుదలకు సిద్ధమవుతున్నది. కరుణకుమార్ దర్శకుడు. డాక్టర్ విజయేందర్‌రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మాతలు. నవంబర్ 14న సినిమా విడుదలకానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రచారంలో జోరు పెంచారు.
ఈ మూవీలో నవీన్‌చంద్ర సాహూగా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఆయన పాత్రను పరిచయం చేస్తూ ఫస్ట్‌లుక్‌ని శనివారం విడుదల చేశారు. స్కూటర్‌పై కూర్చుని సీరియస్‌గా చూస్తున్న నవీన్‌చంద్రను ఈ పోస్టర్లో చూడొచ్చు.
వరుణ్‌తేజ్ కెరీర్లోనే అత్యంతభారీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి కథానాయికలు. అజయ్‌ఘోష్, కన్నడ కిశోర్, రవీంద్రవిజయ్, పి.రవిశంకర్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎ.కిశోర్‌కుమార్, సంగీతం: జి.వి.ప్రకాశ్‌కుమార్.