Mathu Vadalara 2 | స్వర మాంత్రికుడు ఎమ్.ఎమ్ కీరవాణి తనయుడు శ్రీ సింహా, కమెడియన్ సత్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘మత్తు వదలరా 2’. బ్లాక్ బస్టర్ మూవీ ‘మత్తు వదలరా’కు సీక్వెల్గా వస్తున్న ఈ చిత్రానికి రితేశ్ రానా దర్శకత్వం వహిస్తున్నాడు. క్రైం కామెడీ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో జాతి రత్నాలు ఫేం ఫరియా అబ్దుల్లా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
ఈ సినిమాను సెప్టెంబర్ 13న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. విడుదల తేదీ దగ్గర పడటంతో వరుస ప్రమోషన్స్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు. కామెడీతో యాక్షన్ ప్యాక్డ్గా సాగిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మరోవైపు ఈ సినిమా సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చినట్లు చిత్రబృందం ప్రకటించింది.