‘మత్తు వదలరా’ సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన చిత్రం ‘మత్తు వదలరా 2’. శ్రీసింహ కోడూరి, సత్య లీడ్‌రోల్స్ చేసిన ఈ చిత్రానికి రితేష్ రానా దర్శకుడు. చిరంజీవి(చెర్రీ), హేమలత నిర్మాతలు. ప్రచార చిత్రాల వల్ల ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఈ నెల 13న సినిమా విడుదల కానుంది. ఈ సందర్బంగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ని అగ్రహీరో ప్రభాస్ విడుదల చేసి, చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు.
సీక్వెల్కోసం దర్శకుడు రితేష్ అద్భుతమైన నేపథ్యాన్ని ఎంచుకున్నాడని, ఇందులో ప్రతి పాత్ర కీరోల్ ప్లే చేస్తుందని, వినోదాన్ని పంచే అంశాలు ఇందులో చాలా ఉంటాయని మేకర్స్ తెలిపారు. ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటించిన ఈ చిత్రంలో సునీల్, అజయ్, వెన్నెల కిశోర్, రోహిణి, రాజా చెంబోలు, ఝాన్సీ, శ్రీనివాసరెడ్డి ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: సురేశ్ సారంగం, సంగీతం: కాలభైరవ.