Kalyanram | నందమూరి కల్యాణ్‌రామ్ నటిస్తున్న యాక్షన్ ప్యాక్డ్ ఎంటైర్టెనర్ ‘ఎన్ఆర్కే 21’(వర్కింగ్ టైటిల్). ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విజయశాంతి ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మాతలు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. ప్రస్తుతం భారీ యాక్షన్ ఎపిసోడ్‌ని చిత్రీకరిస్తున్నారు.
ఈ ఎపిసోడ్లో 150మంది ఫైటర్లు, 300మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటున్నారు. పీటర్ హెయిన్స్ పర్యవేక్షణలో చిత్రీకరిస్తున్న ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు మేజర్ హైలైట్‌గా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన వర్కింగ్ స్టిల్స్‌లో పీటర్ హెయిన్స్ ఆర్టిస్టులకు సజెషన్స్ ఇస్తూ కనిపిస్తున్నారు. చాలాకాలం తర్వాత పవర్ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో విజయశాంతి నటిస్తున్న ఈ చిత్రంలో సోహైల్‌ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: రామ్‌ప్రసాద్, సంగీతం: అజనీష్ లోక్‌నాథ్, నిర్మాణం: అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్.