VasudevaSutham Teaser | దేవి సినిమాతో చైల్డ్ యాక్టర్‌గా సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు మాస్టర్ మహేంద్రన్. ఈ టాలెంటెడ్ యాక్టర్ హీరోగా నటిస్తున్న చిత్రం వసుదేవసుతం. వైకుంఠ్ బోను డైరెక్ట్ చేస్తున్నాడు. టాలీవుడ్ యాక్టర్ సత్యదేవ్ ఈ మూవీ టీజర్‌ను లాంచ్ చేశాడు.
ఈ కథ ధర్మానికి అడ్డొస్తే మేనమామ అయినా.. లక్షల బంధుగణమైనా.. ఎదురుగా కోట్ల సాయుధులే ఉన్నా.. ధర్మ హింస తథైవచ అన్న శ్రీ కృష్ణుడిదే కాదు.. ధర్మాన్ని కాపాడేందుకు ఎంతటి మారణహోమానికైనా ఎదురెళ్లే యువకుడిది అంటూ సాగుతున్న డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. గుడి, గుప్త నిధి చుట్టూ తిరిగే సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో సినిమా సాగను్నట్టు టీజర్‌తో హింట్ ఇచ్చేశాడు డైరెక్టర్.
ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, జాన్ విజయ్, మీమ్గోపి, తులసి, టార్జన్, రామరాజు, భద్రమ్, జబర్ధస్త్ రాంప్రసాద్, శివన్నారాయణ, దువ్వాసి మోహన్, సుమేత బజాజ్, అంబికావాణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలువబోతున్నట్టు టీజర్ ద్వారా తెలిసిపోతుంది.
ఈ మూవీ రిలీజ్ డేట్‌పై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్. ఈ చిత్రాన్ని రెయిన్బో సినిమాస్ బ్యానర్‌పై ధనలక్ష్మి బాదర్ల నిర్మిస్తున్నారు.
Dharma Himsa Tathaiva Cha ⚔️
Witness the rise of a young warrior in his fierce battle against evil 💥@ActorSatyaDev unveils the gripping teaser of #VasudevaSutham , a powerful blend of mythology, high-octane action, and powerful emotionshttps://t.co/xF8TBT1cxf… pic.twitter.com/8GA4lDBTsS
— BA Raju’s Team (@baraju_SuperHit) October 11, 2025
Srinidhi Shetty | సిద్ధు పాత్రతో ప్రేమలో పడిపోతారు.. తెలుసు కదా సినిమాపై శ్రీనిధి శెట్టి
Kiran Abbavaram | కిరణ్ అబ్బవరం వెబ్‌సిరీస్ జోనర్ ఇదేనట..!
RC 17 | రామ్ చరణ్ -సుకుమార్ ప్రాజెక్ట్‌పై క్రేజీ అప్డేట్.. షూటింగ్ ఎప్పుడు మొదలు కానుంది అంటే..!