RC 17 | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న “పెద్ది” సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను 2026 మార్చిలో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. అయితే, పెద్ది పూర్తయ్యాక రామ్ చరణ్ తదుపరి సినిమాగా ఏం చేయనున్నాడు అనే విషయంలో అభిమానుల్లో ఆసక్తి పెరిగిపోయింది. తాజాగా టాలీవుడ్ వర్గాల్లో ఓ ఆసక్తికరమైన టాక్ వినిపిస్తోంది. చరణ్ – సుకుమార్ కాంబినేషన్లో RC17 సినిమా స్క్రిప్ట్ పూర్తిగా ఫైనలైజ్ అయ్యిందట. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా త్వరలోనే ప్రారంభం కానున్నాయని సమాచారం.
2025 ఫిబ్రవరిలో ఈ ప్రాజెక్ట్ తొలి షెడ్యూల్ మొదలవుతుందని టాక్. అలాగే ఈ చిత్రాన్ని సంక్రాంతికి గ్రాండ్‌గా ఓపెనింగ్ చేయాలనే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే కాంబోలో గతంలో వచ్చిన రంగస్థలం చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో రామ్ చరణ్ పోషించిన ‘చిట్టిబాబు’ పాత్ర ఆయన కెరీర్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్‌గా నిలిచింది. అంతటి విజయం తర్వాత మళ్లీ ఈ ఇద్దరూ కలిసి పనిచేయబోతున్నారన్న వార్తతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా గురించి అధికారిక ప్రకటనా రావాల్సి ఉన్నా, ఫ్యాన్స్‌లో మాత్రం అంచనాలు పీక్స్‌కి చేరుకున్నాయి..
‘రంగస్థలం’ తరహాలోనే మరోసారి ఎమోషనల్, మాస్ డ్రామాతో పాటు విజువల్ ట్రీట్ అందించేందుకు సుకుమార్ సిద్ధమవుతున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. RC17 పై మరిన్ని అప్డేట్స్ కోసం చరణ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కూడా రంగస్థలం లాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా? లేదా అనేది వేచి చూడాలి. రామ్ చరణ్ గేమ్ చేంజర్ వంటి ఫ్లాప్ తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది చేస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఇందులో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.