VasudevaSutham | దేవి సినిమాతో తెలుగులో చైల్డ్ ఆర్టిస్టుగా సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు మాస్టర్ మహేంద్రన్. ఈ తమిళ యాక్టర్ నటిస్తోన్న సినిమా వసుదేవసుతం (Vasudheva Sutham). మల్టీ లింగ్యువల్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వైకుంఠ్ బోను దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ నుంచి వసుదేవ సుతం దేవమ్ సాంగ్ లిరికల్ వీడియోను ఆకాశ్ పూరీ విడుదల చేశాడు.
పవన్ చరణ్ బోనిలా, శృతిక సముద్రాల పాడారు. మణిశర్మ కంపోజ్ చేసిన ఈ పాటను చైతన్య ప్రసాద్ రాశారు. ఈ పాట కలర్ ఫుల్ విజువల్స్‌తో సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలువబోతున్నట్టు చెప్పకనే చెబుతోంది. మ్యాజికల్ వాయిస్‌తో సాగుతున్న ఈ పాట మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేయడం పక్కా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, గ్లింప్స్‌ను షేర్ చేయగా.. మంచి స్పందన వస్తోంది.. దైవిక అంశాల చుట్టూ తిరిగే కథాంశంతో సినిమా ఉండబోతున్నట్టు గ్లింప్స్ హింట్ ఇచ్చేస్తుంది. గ్లింప్స్‌లో మాస్టర్ మహేంద్రన్ త్రిశూలాన్ని పట్టుకున్న విజువల్స్ గూస్బంప్స్ తెప్పిస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ఉత్కంఠభరితమైన నిధి సాహసం నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్టు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
వసుదేవసుతం టైటిల్ ట్రాక్..
Talented Hero @AkashJagannadh launches the divine and mesmerizing #VasudhevaSuthamDhevam from #Vasudevasutham 💫
The #ManiSharma’s musical
Watch NOW 👇
▶️ https://t.co/pJLIYvX0Ke🎙️ #PavanCharanBonila & #ShruthikaSamudhrala
🖊️ #ChaitanyaPrasad@Actor_Mahendran#Ambikavani… pic.twitter.com/rr19UcnZ4V— Ramesh Bala (@rameshlaus) October 31, 2025
Janhvi Kapoor | రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ రిలీజ్
Dil Raju | సల్మాన్ ఖాన్‌తో భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్న దిల్ రాజు .. క్రేజీ అప్డేట్ ఏంటంటే..!
Mass Jathara Review | ‘మాస్ జాతర’ రివ్యూ.. రవితేజ కొత్త మూవీ ఎలా ఉందంటే.?