Mass Jathara Second Single | మాస్ మహరాజ రవితేజ హీరోగా శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్ జాతర'(Mass Jathara). ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకత్వం వహిస్తుండగా.. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆగష్టు 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్స్ మొదలుపెట్టింది చిత్రయూనిట్. తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ అప్డేట్ను పంచుకుంది. ఈ మూవీ నుంచి సెంకడ్ సింగిల్ సాంగ్ ఒలే ఒలే ప్రోమోను రేపు (ఆగస్టు 4న) ఉదయం 11 గంటల 8 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది. పూర్తి లిరికల్ సాంగ్ ఆగస్టు 5న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర యూనిట్ ఒక ప్రత్యేక పోస్టర్ను విడుదల చేసింది. భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
It’s that time again to ramp up the MASS HYSTERIA 🔥#MassJathara second single #OleOle Promo out tomorrow at 11:08 AM. ❤️🔥
Full Song will make you groove from August 5th 🤟🏻#MassJatharaOnAug27th
Mass Maharaaj @RaviTeja_offl @Sreeleela14 @BhanuBogavarapu @vamsi84 #SaiSoujanya… pic.twitter.com/wrKz08Yd4N— BA Raju’s Team (@baraju_SuperHit) August 3, 2025