Mass Jathara First Single | మాస్ మహరాజా రవితేజ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్ జాతర’(Mass Jathara). ‘మనదే ఇదంతా’ ట్యాగ్‌లైన్. ఈ సినిమాకు భాను భోగవరపు దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీలీల కథానాయికగా నటిస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మే 9న థియేటర్లలో సందడి చేయనుంది. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమోను విడుదల చేశారు మేకర్స్.
‘తు మేరా లవర్’ (TumeraLover) అంటూ సాగే ఈ ప్రోమోలో రవితేజ నటించిన ఐకానిక్ మూవీ ఇడియట్ లోని ‘చూపుల్తో గుచ్చి గుచ్చి పాటను రీక్రియేట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. కాగా దీని పూర్తి పాట ఈ నెల 14న విడుదల కానుంది. టైటిల్‌కు తగినట్లుగానే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉండబోతుందని చిత్రబృందం వెల్లడించింది. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతాన్నందిస్తున్నారు.