‘ఎన్టీఆర్ నా అభిమాన నటుడు. ఆయనలా మాస్, యాక్షన్ హీరోగా పేరుతెచ్చుకోవాలన్నది నా అభిమతం’ అని అన్నారు అభయ్ సింహా. ఆయన హీరోగా నటించిన ‘క్రష్’ చిత్రం ఇటీవల ఓటీటీ ద్వారా విడుదలైంది. ఈ సందర్భంగా అభయ్సింహా ఇటీవల హైదరాబాద్‌లో పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘ డ్యాన్స్, మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నా. ‘క్రష్’ సినిమాకు సెలెక్ట్ కావడం నా జీవితాన్ని మలుపుతిప్పింది. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం నటుడిగా నాకు మంచి పేరుతెచ్చిపెట్టింది. కెమెరా ముందు రొమాంటిక్ సీన్స్‌లో నటించడానికి ఎలాంటి ఇబ్బందిపడలేదు. లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వంలో రూపొందుతున్న ‘కమిట్మెంట్’ ఓ హీరోగా నటిస్తున్నా. అంథాలజీ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం త్వరలో విడుదలకానుంది. ‘సలీం అక్బర్ అనార్కలి’ చిత్రం ఆగస్టులో సెట్స్‌పైకిరానున్నది’ అన్నారు.