Tanuja | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో అగ్నిపరీక్ష ద్వారా హౌస్‌లోకి వచ్చిన కంటెస్టెంట్ మర్యాద మనీష్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈ సీజన్లో నామినేషన్స్ సమయంలో రీ-ఎంట్రీ ఇచ్చిన మనీష్, అప్పట్లో కంటెస్టెంట్ తనూజపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి. నామినేషన్స్ టాస్క్ సమయంలో తనూజను ఉద్దేశించి “ముద్దు ముద్దు మాటలతో టైమ్ పాస్ చేస్తోంది” అంటూ చేసిన కామెంట్స్ ఆమెను తీవ్రంగా బాధించాయి. ముఖ్యంగా ఆమె నటించిన ‘ముద్ద మందారం’ సీరియల్ టైటిల్‌ను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు తనూజను హర్ట్ చేసినట్టు ఆమె ఓపెన్‌గా చెప్పింది.
ఇక ఫ్యామిలీ వీక్‌లో తనూజ కోసం హౌస్‌కు వచ్చిన సీరియల్ నటుడు హరిత కూడా ఈ ‘ముద్ద మందారం’ అంశాన్ని ప్రస్తావించడంతో పరిస్థితి మరింత ఎమోషనల్ అయింది. ఈ ఘటన తర్వాత సోషల్ మీడియాలోనూ ఈ టాపిక్‌పై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్లో “ఎవరైనా సారీ చెప్పాలని ఆశిస్తున్నావా?” అని అడిగినప్పుడు, మర్యాద మనీష్ చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయని తనూజ వెల్లడించింది. అయితే అతని నుంచి ప్రత్యేకంగా క్షమాపణ ఆశించడం లేదని కూడా స్పష్టం చేసింది. తనకు ఆటలో భాగంగానే కొన్ని విషయాలు జరిగాయని ఆమె చెప్పింది.
ఫైనల్ ఎపిసోడ్ ముగిసిన తర్వాత మర్యాద మనీష్ తన సోషల్ మీడియా ద్వారా తనూజకు పబ్లిక్‌గా క్షమాపణ చెప్పాడు. తన పోస్టులో మనీష్ ఇలా పేర్కొన్నాడు… హౌస్‌లో తనూజ ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని, తాను లో ఫీల్ అయిన టైమ్‌లో కూడా ఆమె తనకు సపోర్ట్ ఇచ్చిందని, రీ-ఎంట్రీ సమయంలో ఆమెను టార్గెట్ చేయాలని అనుకున్న సందర్భంలో భాగంగానే ఆ మాటలు వచ్చాయని.. అవన్నీ ఆట వరకే తప్ప, ఆమెను వ్యక్తిగతంగా బాధపెట్టాలనే ఉద్దేశం తనకు లేదని అన్నాడు. మైక్ తనకు దొరికితే అదే టైమ్‌లోనే అపాలజీ చెప్పేవాడినని, కానీ ఆ అవకాశం రాలేదని మనీష్ తెలిపాడు. అలాగే తనూజ భవిష్యత్ ప్రాజెక్ట్స్‌కు ఆల్ ది బెస్ట్ కూడా చెప్పాడు.
ఇక చివరగా తన స్టైల్లో తనపైనే సెటైర్ వేసుకుంటూ, “ఇతరులపై పూలు వేయడం కాదు, కనీసం తన మీద తానే పూలు వేసుకోలేని మనిషిని” అంటూ సరదాగా ముగించాడు మర్యాద మనీష్. మనోడు అపాలజీకి తనూజ ఫ్యాన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. తప్పు చేసినప్పుడు అంగీకరించి క్షమాపణ చెప్పడం మంచి విషయమని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు, దాదాపు విన్నర్ మెటీరియల్ అనిపించుకున్న తనూజకు ఈ సీజన్ అంతా ప్రేక్షకుల నుంచి మంచి సపోర్ట్ లభించింది. మరి మర్యాద మనీష్ అపాలజీ మెసేజ్‌పై తనూజ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి అనే ఆసక్తి నెలకొంది.