క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన విలక్షణ మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీతో తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించుకున్నారు రావు రమేష్. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’. ఇంద్రజ కీలక పాత్రధారి. లక్ష్మణ్ కార్య దర్శకుడు. చిత్రీకరణ పూర్తయింది. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘వినోద ప్రధానంగా సాగే చిత్రమిది.
రావురమేష్ పాత్ర ఆద్యంతం కడుపుబ్బా నవ్విస్తుంది. ఆయన సంభాషణలు చెప్పిన తీరు థియేటర్లలో విజిల్స్ వేయిస్తుంది. కథలో భాగంగానే చక్కటి కామెడీ పండుతుంది’ అన్నారు. అజీజ్నగర్, బీహెచ్ఈఎల్, కనకమామిడి, వనస్థలిపురం వంటి ప్రదేశాల్లో చిత్రీకరణ జరిపామని. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాతలు తెలిపారు. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, అజయ్, హర్షవర్ధన్, ప్రవీణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: బాల్రెడ్డి, సంగీతం: కల్యాణ్ నాయక్.