Maruthi | డార్లింగ్ ప్రభాస్ సినిమాలంటే అభిమానులలో ఎంత అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న ప్రభాస్.. రాజా సాబ్ అనే చిత్రంతో త్వరలో ప్రేక్షకులని పలకరించనున్నాడు. ఈ సినిమా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతుంది. మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ కామెడీ నెక్ట్స్ లెవెల్లో ఉంటుందని అంటున్నారు. ఈ మూవీని చూద్దాం అని ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తుండగా, మూవీ అంతకంతకూ ఆలస్యం అవుతూనే ఉంది. అసలు ఈ మూవీ వస్తుందా? లేదా? అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
అయితే ఇప్పుడు రాజా సాబ్ చిత్రం పాన్ ఇండియా స్థాయికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేస్తున్నారు. దీంతో సినిమా ఆలస్యం అవుతూనే ఉంది. ఇదొక హారర్, కామెడీ సినిమా కాగా, వీఎఫ్ఎక్స్ వర్క్ చాలా ఉందని అంటున్నారు. ఆ వర్క్ ఇంకా పూర్తి కాలేదు కాబట్టే సినిమా రిలీజ్ లేట్ అవుతుంది. కనీసం మూవీ అప్డేట్స్ కూడా ఇవ్వడం లేదు అని మారుతిని దారుణంగా తిట్టిపోస్తున్నారు. ప్రభాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హారర్ జానర్ లో రాజా సాబ్ సినిమాను దర్శకుడు మారుతి రూపొందిస్తుండటంతో ఈ సినిమా మీద అందరిలో క్యూరియాసిటీ ఏర్పడుతోంది.
డార్లింగ్ ఫ్యాన్స్ రాజా సాబ్ సినిమా అప్డేట్ కోసం రిక్వెస్ట్ చేయగా.. సమాధానం ఇస్తూ షూటింగ్ అప్డేట్ చెప్పారు డైరెక్టర్ మారుతి. వీఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయి.. ఇంకా ఆ కంపెనీల నుంచి అవుట్ పుట్ రాలేదు.. సినిమా అంటే ఏ ఒక్కరి పనో కాదు.. అందరు కలెక్టివ్‌గా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.. సరైన టైం కుదిరితే మూవీ నుండి అన్ని అప్డేట్స్ వస్తాయి.. అప్పటి వరకు కాస్త ఓపికతో ఉండండి.. సహనం వహించండి అంటూ మారుతి ట్వీట్ వేశాడు. సీజీ వర్క్స్ కంప్లీట్ అయితే నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ “రాజా సాబ్” సినిమా విడుదల తేదీని ప్రకటిస్తుంది. చిత్రం కోసం మేము పడిన కష్టాన్ని, మా ప్యాషన్ ను వీలైనంత త్వరగా మీకు చూపించాలని కోరుకుంటున్నాము అని మారుతి తెలిపారు.