ధృవ సర్జా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘మార్టిన్’ ట్రైలర్‌ను ముంబైలో గ్రాండ్‌గా విడుదల చేశారు. ఏ.పి.అర్జున్ దర్శకత్వంలో ఉదయ్ కె.మెహతా నిర్మించిన ఈ పాన్ ఇండియా చిత్రం ఈ ఏడాది అక్టోబర్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. భారతీయ సినిమా స్థాయిని పెంచేలా ఈ సినిమా రూపొందిందని, భవిష్యత్ సినిమాకు బెంచ్ మార్క్ సెట్ చేసేలా ఈ సినిమా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.
నటుడిగా ధృవ సర్జాను మరో స్థాయిలో ఈ సినిమా నిలబెడుతుందని మేకర్స్ చెబుతున్నారు. వైభవీ శాండిల్య, అన్వేషి జైన్, అచ్యుత్‌కుమార్ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కథ: అర్జున్ సర్జా, కెమెరా: సత్య హెగ్డే, సంగీతం: రవి బస్రూర్, మణిశర్మ, నిర్మాణం: వాసవి ఎంటర్ప్రైజెస్, ఉదయ్ కె.మెహతా ప్రొడక్షన్స్.