Mark Antony | టాలెంటెడ్ యాక్టర్ విశాల్ (Vishal) నటిస్తున్న సినిమాల్లో ఒకటి మార్క్ ఆంటోనీ (Mark Antony). అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎస్జే సూర్య, సెల్వ రాఘవన్, సునీల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్జే సూర్య లుక్‌తో ఈ సినిమా టీజర్ అప్డేట్ను ఇప్పటికే మేకర్స్ అందించారు. తాజాగా విశాల్ ఫస్ట్ లుక్ విడుదల చేస్తూ.. టీజర్ లాంఛింగ్ టైం చెప్పారు. ఏప్రిల్ 27న సాయంత్రం 6:30 గంటలకు టీజర్ లాంఛ్ చేయబోతున్నట్టు తెలియజేశారు.
విశాల్ బ్యాక్‌డ్రాప్‌లో గన్స్ కనిపిస్తుండగా.. చేతిలో ఫోన్ పట్టుకుని కనిపిస్తున్నాడు. మార్క్ ఆంటోనీకి జీవీ ప్రకాశ్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అందిస్తున్నాడు. మార్క్ ఆంటోనీ నుంచి మోషన్ పోస్టర్‌ను లాంఛ్ చేసి.. సునీల్, ఎజేసూర్య, సెల్వ రాఘవన్ పాత్రలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పటికే తెలియజేశారు మేకర్స. ఈ చిత్రాన్ని మినీ స్టూడియో బ్యానర్‌పై వినోద్ కుమార్ తెరకెక్కిస్తున్నారు.
మార్క్ ఆంటోనీ చిత్రంలో పెళ్లి చూపులు ఫేం రీతూవర్మ (Ritu Varma) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. విశాల్ దీంతోపాటు స్వీయ దర్శకత్వంలో తుప్పరివాలన్ 2 మూవీ చేస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న ఈ డిటెక్టివ్ ఫిల్మ్‌ను హోంబ్యానర్ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీపై విశాల్ స్వయంగా నిర్మిస్తున్నాడు.
మార్క్ ఆంటోనీ టీజర్ అప్డేట్ లుక్..
The blazing #MarkAntony Teaser to release on April 27th at 6:30 pm! 🔥👍🏼#MarkAntonyTeaserFromApril27
A @gvprakash Musical! 🎼@VishalKOfficial @iam_SJSuryah@vinod_offl @Adhikravi @riturv #SunilVerma #nizhalgalravi @ministudiosllp #YGeeMahendran@editorvijay @AbinandhanR pic.twitter.com/gmbhqmJuoF
— BA Raju’s Team (@baraju_SuperHit) April 25, 2023
మార్క్ ఆంటోనీ మోషన్ పోస్టర్..
Jailer | రజినీకాంత్ జైలర్ రిలీజ్ టైం ఫిక్సయినట్టే..
Agent | ఏజెంట్ నుంచి ఊర్వశి రౌటేలా వైల్డ్ సాలా వీడియో సాంగ్