Agent | టాలీవుడ్ యాక్టర్ అఖిల్ అక్కినేని (Akhil Akkineni) నటిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ఏజెంట్ (Agent). యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి (Surenderreddy) డైరెక్ట్ చేస్తున్నాడు. ఏజెంట్ ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా తెలుగుతోపాటు వివిధ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి వైల్డ్ సాలా వీడియో సాంగ్ (Wild Saala video song) లాంఛ్ చేశారు.
బాలీవుడ్ భామ ఊర్వశి రౌటేలా అందాల ఆరబోతతో హాట్‌గా, స్టైలిష్‌గా సాగుతున్న ఈ పాట సినిమాకు హైలెట్‌గా నిలవబోతున్నట్టు వీడియో సాంగ్‌తో అర్థమవుతోంది. రఘురాం రాసిన ఈ పాటను భీమ్స్ సిసిరోలియో కంపోజిషన్‌లో శ్రావణ భార్గవి, భీమ్స్ సిసిరోలియో, స్వాతి రెడ్డి, అమల చెంబోలు పాడారు. ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి (Mammootty) కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ఏజెంట్‌తో మోడల్ సాక్షి వైద్య (Sakshi vaidya) తొలిసారి సిల్వర్ స్క్రీన్‌పై హీరోయిన్గా మెరవబోతుంది. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. మురళీ శర్మ, పోసాని కృష్ణమురళి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏజెంట్ చిత్రానికి వక్కంతం వంశీ కథనందిస్తున్నారు.
వైల్డ్ సాలా వీడియో సాంగ్..
మళ్లీ మళ్లీ నువ్వే సాంగ్ లిరికల్ వీడియో..
ఏజెంట్ టీజర్..
ఏజెంట్ ట్రైలర్..