Jailer | రజినీకాంత్ జైలర్ రిలీజ్ టైం ఫిక్సయినట్టే..
Jailer | రజినీకాంత్ (Rajinikanth) నటిస్తోన్న తాజా చిత్రం జైలర్ (Jailer). నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) దర్శకత్వం వహిస్తున్న జైలర్ విడుదలకు సంబంధించిన వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది.
Jailer | తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) నటిస్తోన్న తాజా చిత్రం జైలర్ (Jailer). నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ కామెడీ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న జైలర్‌లో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, టాలీవుడ్ నటుడు సునిల్, తమన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్, రమ్యకృష్ణ, యోగిబాబు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
తాజాగా జైలర్ విడుదలకు సంబంధించిన వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. జైలర్‌ను ఇండిపెండెన్స్ డే వీక్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని ఓ వార్త ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. ఇదే నిజమైతే శివకార్తికేయన్ నటిస్తోన్న మావీరన్‌తో బాక్సాఫీస్ వద్ద పోటీ పడనుంది జైలర్. మావీరన్ ఆగస్టు 11న థియేటర్లలో సందడి చేయనుంది. మరి జైలర్ విడుదల తేదీపై మేకర్స్ ఏదైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలంటున్నారు సినీ జనాలు.
ఇప్పటికే జైలర్ నుంచి విడుదలైన మోహన్ లాల్, సునీల్, తమన్నా (Tamannaah) స్టిల్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. జైలర్ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.
జైలర్ తలైవాకు 169వ ప్రాజెక్ట్. కాగా రజినీకాంత్ మరోవైపు జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేళ్ దర్శకత్వంలో తలైవా 170 (Thalaivar 170)కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. టాప్ ప్రొడక్షన్ హౌజ్ లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. త్వరలో మరిన్ని వివరాలపై క్లారిటీ ఇవ్వనుంది తలైవా టీం.
రజినీకాంత్ జైలర్ గ్లింప్స్ వీడియో..
తమన్నా గ్లామరస్ లుక్..
.@tamannaahspeaks from the sets of #Jailer
@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial pic.twitter.com/sKxGbQcfXL
— Sun Pictures (@sunpictures) January 19, 2023
జైలర్ సెట్స్ లో సునిల్
.@mee_sunil from the sets of #Jailer @rajinikanth @Nelsondilpkumar @anirudhofficial pic.twitter.com/JJBfQw91QH
— Sun Pictures (@sunpictures) January 17, 2023
జైలర్ సెట్స్ లో మోహన్ లాల్..
Lalettan @mohanlal from the sets of #Jailer 🤩@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial pic.twitter.com/wifqNLPyKf
— Sun Pictures (@sunpictures) January 8, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

