Actor Killed | మహారాష్ట్రలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో మరాఠీ టీవీ నటి దుర్మరణం పాలయ్యింది. ఆమె ప్రయాణిస్తున్న బైకును కాంక్రీట్ మిక్సర్ ట్రాక్టర్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి చనిపోయింది. ఈ ఘటన కొల్హాపూర్ జిల్లాలో శనివారం రాత్రి జరిగింది.
కల్యాణి కురాలే జాదవ్ (32) ప్రయాణిస్తున్న బైక్‌ను కాంక్రీట్ మిక్సర్ ట్రాక్టర్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడింది. శనివారం రాత్రి ఇంటికి వెళ్తుండగా సాంగ్లీ-కొల్హాపూర్ హైవేపై హలోండి కూడలి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం సమీపంలోని దవాఖానకు తరలించారు. అయితే, అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ‘తుజ్హత్ జీవ్ రంగాల’ అనే మరాఠీ టీవీ సీరియల్లో నటిస్తున్నా కళ్యాణి కురాలే జాదవ్ చాలా పాపులారిటీ సంపాదించారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్‌పై ఐపీసీ, మోటార్ వెహికల్ యాక్ట్ నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసినట్లు కొల్హాపూర్ పోలీసు అధికారి తెలిపారు.