మనుషులకు అర్థం కాని వేదన!

‘ప్రతి నటుడికి కెరీర్లో గొప్ప సినిమా చేయాలనే లక్ష్యం ఉంటుంది. అన్ని అంశాలు పక్కాగా కుదిరిన కథ కోసం అన్వేషిస్తుంటారు. నా కల ఈ సినిమాతో నెరవేరింది’ అన్నారు శివ కందుకూరి. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘మనుచరిత్ర’. భరత్ పెదగాని దర్శకుడు. నారల శ్రీనివాసరెడ్డి నిర్మాత. గురువారం టీజర్‌ను విడుదల చేశారు. ‘వాడు పడుతున్న బాధ అంతా ఇంతా కాదు. వాడి ఏడుపు దేవుడికి వినిపించేంత..మనుషులకు అర్థం కానంత..’ అనే సంభాషణతో సాగిన టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ప్రేమలోని వ్యథను, సంఘర్షణను ఆవిష్కరిస్తూ ఇంటెన్స్ ప్రేమకథగా అనిపించింది. ఈ సందర్భంగా రాజ్‌కందుకూరి మాట్లాడుతూ ‘తీవ్రమైన భావోద్వేగాలు కలబోసిన ప్రేమకథా చిత్రాలు తప్పకుండా విజయవంతమవుతాయి. ప్రస్తుతం ట్రెండ్‌కు తగిన కథ ఇది. చంద్రబోస్ అద్భుతమైన పాటలిచ్చారు’ అని చెప్పారు. ప్రేక్షకుల హృదయాలపై గాఢమైన ప్రభావాన్ని చూపించే చిత్రమిదని దర్శకుడు చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ ‘వైవిధ్యమైన కథే ఈ సినిమాకు బలం. కొత్త దర్శకుడు కొత్త ఆలోచనలతో తెరకెక్కించిన చిత్రమిది’ అన్నారు. కథానుగుణంగా మంచి పాటలు కుదిరాయని సంగీత దర్శకుడు గోపీసుందర్ తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

