బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్.. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌తో దేశ వ్యాప్తంగా ఎంతో ఆదరణ అందుకున్నాడు.ఇటీవల ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాగా, ఆందులో మనోజ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఎన్నో తెలుగు చిత్రాల్లోను తనదైన నటనను కనబరిచి ఇప్పుడు ఓటిటి లో సూపర్ స్టార్ గా ఉన్నారు.
మనోజ్ బాజ్‌పాయ్ తండ్రి ఆర్ కె భాజ్ పై కాయస్థ అస్వస్థతకు లోనయ్యినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనోజ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ నిమిత్తం కేరళలో షూట్ తో బిజీగా ఉండగా, వార్త తెలిసి వెంటనే ఢిల్లీకి వచ్చేసారు. మనోజ్ తండ్రికి ప్రస్తుతం హాస్పిటల్ లో హెల్త్ ఎమర్జెన్సీ పై చికిత్స అందిస్తున్నారట.
ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ డాన్‌గా కనిపిస్తారని సమాచారం. ఇందులో ఆయన్ని ఢీ కొట్టే ప్రతినాయకుడిగా ‘ఫ్యామిలీమేన్’ ఫేమ్ మనోజ్ బాజ్‌పాయ్‌ని ఎంపిక చేశారని సమాచారం. ఇటీవలే హైదరాబాద్‌లో ఓ కీలక షెడ్యూల్‌ని చిత్రీకరించారు. ఇందులో కథానాయికగా శృతి హాసన్ నటిస్తుంది.