Twitter Hacked | బాలీవుడ్ సీనియర్ నటుడు మనోజ్ బాజ్‌పేయి ట్విట్టర్ అకౌంట్ హ్యాక్‌కు గురైంది. ఈ విషయాన్ని మనోజ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ‘నా ట్విట్టర్ ఖాతా హ్యాక్గు గురైంది. ట్విట్టర్లో పోస్టు చేసే వాటికి ఎవరూ స్పందించొద్దు. ఖాతాను తిరిగి పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నా. సమస్య పరిష్కారం అయ్యాక అప్డేట్ చేస్తా’ అంటూ పోస్టు చేశారు. కాగా, ఇవాళ చాలా మంది ట్విట్టర్ ఖాతాలు హ్యాక్‌కు గురైన విషయం తెలిసిందే. 20 కోట్ల మంది ట్విట్టర్ యూజర్ల మెయిల్ ఐడీలు లీకైనట్లు ఓ సెక్యూరిటీ రీసెర్చర్ వెల్లడించారు.
ఇక మనోజ్.. బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్లో కూడా పలు సినిమాల్లో నటించారు. ముఖ్యంగా ‘హ్యాపీ’ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించారు. ఇటీవల సమంత ప్రధాన పాత్రలో వచ్చిన ‘ఫ్యామిలీ మెన్’ వెబ్ సిరీస్‌లో నటించి మెప్పించారు. ప్రస్తుతం బాలీవుడ్లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.
ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ (Twitter) ఖాతాలు హ్యాకింగ్‌కు (Hacking) గురయ్యాయి. ఈ మైక్రోబ్లాగింగ్ సంస్థకు చెందిన సుమారు 20 కోట్ల మందికిపైగా యూజర్ల ఈ-మెయిల్ ఐడీలను లీక్ చేసినట్లు తెలుస్తున్నది. హ్యాకర్లు వాటిని ఆన్లైన్ హ్యాకింగ్ ఫోరంలో అందుబాటులో ఉంచినట్టు ఓ సెక్యూరిటీ రీసెర్చర్ వెల్లడించారు. దీంతో టార్గెటెడ్ ఫిషింగ్ (Phishing), డాక్సింగ్ (Doxxing) వంటివి జరిగే అవకాశం ఉందని ఇజ్రాయెల్‌కు చెందిన సైబర్ సెక్యూరిటీ మానిటరింగ్ సంస్థ హుడ్సన్ రాక్ సహవ్యవస్థాపకుడు ఆలోన్ గాల్ (Alon Gal) చెప్పారు. తాను చూసిన అతిపెద్ద ‘డేటా లీక్స్’లో ఇది ఒకటన్నారు. అయితే ఈ వ్యవహారంపై ట్విట్టర్ ఇప్పటివరు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న సంస్థ ఎలా స్పందిస్తుందని సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.