ఖైరతాబాద్/నాంపల్లి క్రిమినల్ కోర్టు లు, ఏప్రిల్ 12 : న్యాయవాది సుబ్బారావు తనపై చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని, కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని సింగర్ మంగ్లీ ఆరోపించారు. మైక్రోఫైనాన్స్ పేరుతో మంగ్లీ, ఆమె సోదరుడు, అతడి స్నేహితులు తన క్లయింట్ల ను కోట్లాది రూపాయలు మోసం చేశారని న్యాయవాది సుబ్బారావు పోలీసులకు ఫి ర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తనపై వ స్తున్న ఆరోపణలను ఖండిస్తూ మంగ్లీ ఆదివారం పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను రూ.150కోట్ల మోసానికి పా ల్పడినట్టు న్యాయవాది సుబ్బారావు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, తనతో దు రుసుగా మాట్లాడటమే కాకుండా డబ్బు లు డిమాండ్ చేశారని, అవి ఇవ్వనందుకే తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని తెలిపారు.
తనకు సంబంధం లేని కరెన్సీనోట్ల వీ డియోలను వైరల్ చేస్తూ తనను మానసిక వేదనకు గురిచేస్తున్నాడని వాపోయారు. 14 ఏండ్ల నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకు సాగుతున్నానని, ఒక బంజా రా ఆడబిడ్డనైన తనను కావాలనే బద్నాం చేస్తున్నారని అన్నారు. తన పేరు చెప్పుకొని ఎవరో వసూలు చేస్తే దానికి తాను ఏమీ చేయాలని, తనకు ఎలా తెలుస్తుందని, తానేమైనా రోబోనా..? అని ప్రశ్నించారు. నిత్యం ప్రోగ్రామ్లతో బిజీగా ఉండటం వల్ల బయటకు రాలేకపోయానని పేర్కొన్నారు. తన పేరును వాడుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కోకాపేటలో స్కూల్, పబ్ ఎక్కడుందో తనకు తెలియదని, ఆ బిజినెస్ మైండ్ తనకు లేదని తెలిపారు.
బాలాజీ నాయక్, మధునాయక్ దందా చాలా రోజుల నుంచి నడుస్తున్నదని, ప్రస్తుతం ఆ కేసు సీఐడీ పరిధిలో ఉన్నదని పేర్కొన్నారు. ఈ విషయంలో నష్టపోయిన బాధితులకు తాను అండగా నిలబడుతానని స్పష్టంచేశారు. సినిమాల మీద మక్కువతో తన పేరును సుబ్బారావు వాడుకోవాలని చూస్తున్నాడని, మీడియాకు తప్పుడు సమాచారం ఇస్తున్నాడని తెలిపారు. తాను ఈ కేసులో ఉన్నట్టు నిర్ధారణ అయితే ఎక్కడికి రావడానికైనా సిద్ధమని స్పష్టంచేశారు.