సూపర్ స్టార్ రజనీకాంత్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రియ మిత్రులు అనే సంగతి మనందరికి తెలిసిందే. ఆ మధ్య రజనీకాంత్ అనారోగ్యానికి గురైనప్పుడు మోహన్ బాబు తన ఫ్రెండ్ త్వరగా కోలుకోవాలని ప్రార్ధనలు కూడా చేశారు. కొన్నేళ్ల నుండి ఇద్దరి మధ్య మంచి స్నేహం నెలకొని ఉండగా, ఇటీవల తలైవా రజనీకాంత్ ఇంట్లో రెండు రోజుల పాటు స్టే చేశారు. ఆ సమయంలో మంచు ఫ్యామిలీ మొత్తం రజనీకాంత్‌తో ఫొటోలు దిగారు . అవి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.
రజనీకాంత్ ప్రస్తుతం అన్నాత్తె చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.ఇటీవల ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లో జరగగా, షూటింగ్ పూర్తైన తర్వాత తలైవా డైరెక్ట్‌గా మోహన్ బాబు ఇంటికి వెళ్లారు. అక్కడ మోహన్‌బాబు ఫ్యామిలీతో సంతోషంగా గడిపారు. అనంతరం ప్రత్యేక ఫ్లైట్‌లో చెన్నై వెళ్లారు .అయితే మోహన్ బాబు ఇంటికి వెళ్లిన సమయంలో రజనీకాంత్‌తో మంచు ఫ్యామిలీ దిగిన ఫొటోలను విష్ణు తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ కలిసిన వేళ.. అంటూ మంచు విష్ణు చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.
The OGs. Original Gangsters! @rajinikanth @themohanbabu and then goofy Vishnu Manchu pic.twitter.com/2eUoaKDo5Q
— Vishnu Manchu (@iVishnuManchu) May 21, 2021
ఇవి కూడా చదవండి..
అనంతగిరిలో కొవిడ్ హాస్పిటల్‌ను ఏర్పాటు చేస్తాం
రోడ్డు వెడల్పు పనులను పరిశీలించిన మంత్రి అల్లోల
బావిలోంచి బాలుడి మృతదేహం వెలికితీత
సుందర్ లాల్ బహుగుణ మృతి పట్ల మంత్రి ఐకే రెడ్డి సంతాపం