Ginna Promotions | జిన్నా ప్రమోషనల్ టూర్లో మంచు విష్ణు టీం.. వీడియో వైరల్
ఇషాన్ సూర్య డైరెక్ట్ చేస్తున్న జిన్నా (Ginna) అక్టోబర్ 21న గ్రాండ్‌గా రిలీజ్‌కానుంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో మంచు విష్ణు టీం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.
టాలీవుడ్ హీరో మంచు విష్ణు (Vishnu Manchu), పాయల్ రాజ్‌పుత్, బాలీవుడ్ భామ సన్నీలియోన్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం జిన్నా (Ginna). ఇషాన్ సూర్య డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 21న గ్రాండ్‌గా రిలీజ్‌కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. కాగా విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో మంచు విష్ణు టీం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.
విష్ణు, పాయల్, కోన వెంకట్ అండ్ డైరెక్టర్ టీం కలిసి వివిధ పట్టణాల్లో తిరుగుతోంది. ప్రమోషనల్ టూర్లో భాగంగా రాజమండ్రి, కాకినాడ, శ్రీకాకుళం, వైజాగ్ ప్రాంతాల్లో పర్యటించింది. స్టూడెంట్స్ ఆఫ్ గని మెడికల్ కాలేజ్, ఆదిత్య కాలేజీ, చైతన్య, అవంతితోపాటు పలు కాలేజీలకు వెళ్లింది చిత్రయూనిట్. వెళ్లిన ప్రతీ చోట విష్ణు టీంకు గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు స్టూడెంట్స్ అండ్ మూవీ లవర్స్.
ప్రమోషనల్ టూర్ అనంతపూర్, కడప, బెంగళూరు, హైదరాబాద్, వరంగల్, విజయవాడ పట్టణాల్లో కూడా కొనసాగనుంది. ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, నరేశ్, చమ్మక్ చంద్ర, సునీల్ ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రంగంపేట గ్రామం చుట్టూ తిరిగే కథాంశం నేపథ్యంలో ఫన్ ఎంటర్టైనర్గా రాబోతుంది జిన్నా చిత్రం.
#𝔾𝕀ℕℕ𝔸🔥 movie promotional tour 🙌!
Thank you for your love #Rajahmundry & #Kakinada🙏💐#GinnaBhai🔥#GinnaOn21stOct💥@iVishnuManchu @SunnyLeone @starlingpayal@avaentofficial @24FramesFactory @saregamasouth pic.twitter.com/e6ObNuBcaG
— 24 Frames Factory (@24FramesFactory) October 14, 2022
ఈ చిత్రాన్ని మంచు విష్ణు హోంబ్యానర్ ఏవీఏ ఎంటర్టైన్మెంట్పై 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీతో కలిసి నిర్మిస్తున్నాడు. రంగంపేటలో జరిగిన కథ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి కోన వెంకట్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ డైరెక్టర్. జిన్నా తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
Kick started Day 2 promotions of GINNA” from #ChaitanyaEngCollege Visakhapatnam 🎥
Thank you for ur love & response ❤️ @iVishnuManchu @starlingpayal @SunnyLeone @vennelakishore #GinnaOn21stOct pic.twitter.com/3wFNBUuM8B— KONA VENKAT (@konavenkat99) October 12, 2022
Kick started the promotions of GINNA 🎥 from Rajahmundry along with @iVishnuManchu @starlingpayal #ChammakChandra & #Saddam ❤️❤️ at #GSLInstitutions 👍#GinnaFrom21stOct. pic.twitter.com/fem3h80fE0
— KONA VENKAT (@konavenkat99) October 11, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

