అమరావతి : ప్రముఖ నటుడు మోహన్‌బాబు తనయుడు మంచు మనోజ్ (Manchu Manoj ) బుధవారం సాయంత్రం మరోసారి తిరుపతిలోని మోహన్‌బాబు(Mohanbabu) వర్సిటీకీ రావడంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి .
మంచు మనోజ్ భార్య మౌనికతో కలిసి మధ్యాహ్నం మోహన్‌బాబు వర్సిటీకి రాగా పోలీసులు (Police)లు అడ్డుకుని అనుమతి నిరాకరించారు. కోర్టు ఆదేశాలు ఉన్నందును లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో మనోజ్ నారావారిపల్లెకు వెళ్లి మంత్రి లోకేష్‌తో సమావేశమయ్యారు. అనంతరం రంగంపేటలో జరిగిన పశువుల పండుగ జల్లుకట్టును తిలకించారు.
మోహన్‌బాబు యూనివర్సిటీ వద్ద పోలీసుల లాఠీఛార్జ్
మూడో గేటు నుంచి యూనివర్సిటీ లోపలికి వెళ్లిన మంచు మనోజ్
మనోజ్‌ను అడ్డుకున్న బౌన్సర్లు.. గేటు దూకి లోపలికి వెళ్లే ప్రయత్నం చేసిన మంచు మనోజ్ సిబ్బంది
లాఠీఛార్జ్ చేసిన పోలీసులు https://t.co/tRzEzVCM1I pic.twitter.com/gfnWp2O2J8
— Telugu Scribe (@TeluguScribe) January 15, 2025
సాయంత్రం మరోసారి అనుచరులు, బౌన్సర్లతో వర్సిటీకి వెళ్లగా మరోసారి పోలీసులు అడ్డుకున్నారు. ఒక దశలో ఇరువురు బౌన్సర్లు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. తన తాత , నాయనమ్మ సమాధుల వద్దకు వెళ్తామంటే ఎందుకు అడ్డుకుంటున్నారని మంచు మనోజ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొద్దిసేపు అనంతరం పోలీసులు అనుమతి ఇవ్వడంతో మనోజ్ దంపతులు బందోబస్తు మధ్య తాత, నాయనమ్మ సమాధుల వద్దకు వెళ్లి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ మీడియాతో మాట్లాడుతూ కోర్టు నోటీసులు ఉన్నాయని, లోనికి ప్రవేశానికి అనుమతి లేదంటూ పోలీసుల వివరణకు సమాధానమిచ్చారు. తనకు ఎలాంటి కోర్టు నోటీసులు అందలేదని స్పష్టం చేశారు.
బౌన్సర్లు ఉండొద్దని ఇప్పటికే కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని, అక్కడ బౌన్సర్లు ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. తాను వస్తున్నట్లు ఇతర ప్రాంతాల నుంచి రౌడీలను తెప్పించారని ఆరోపించారు. పోలీసుల మీద ఉన్న గౌరవంతో తాను వెనక్కి వెళ్తున్నానని వెల్లడించారు.