హీరో మంచు మనోజ్ సినీరంగంలో సరికొత్త ప్రయాణాన్ని ఆరంభించారు. ‘మోహన రాగ మ్యూజిక్’ పేరుతో మ్యూజిక్ కంపెనీకి శ్రీకారం చుట్టారు. నటనతో పాటు సంగీతంపై మక్కువ కనబరిచే మంచు మనోజ్ పలు సినిమాల్లో పాటలు పాడి మెప్పించిన విషయం తెలిసిందే. ‘పోటుగాడు’ సినిమాలో ఆయన పాడిన ‘ప్యార్ మే పడిపోయానే’ పాట బాగా పాపులర్ అయింది. అలాగే మిస్టర్ నూకయ్య, నేను మీకు తెలుసా చిత్రాల్లో పాటలకు సాహిత్యాన్ని కూడా అందించారు.
‘నూతన ప్రతిభను ప్రోత్సహిస్తూ ప్రయోగాత్మక సంగీతానికి పెద్దపీట వేయాలన్నది ‘మోహన రాగ మ్యూజిక్’ ప్రధానోద్దేశ్యం. భారతీయ, అంతర్జాతీయ ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా సంగీతాన్ని రూపొందించాలన్నదే మా లక్ష్యం. ఇది తెలుగు సంగీతాన్ని ప్రపంచవేదికపైకి తీసుకెళ్తుందనే నమ్మకం ఉంది’ అని మంచు మనోజ్ టీమ్ పేర్కొంది.