శనివారం 27 ఫిబ్రవరి 2021
Cinema - Jan 24, 2021 , 09:47:01

మాల్దీవుల‌లో మాస్త్ ఎంజాయ్ చేస్తున్న మంచు ల‌క్ష్మీ ఫ్యామిలీ

మాల్దీవుల‌లో మాస్త్ ఎంజాయ్ చేస్తున్న మంచు ల‌క్ష్మీ ఫ్యామిలీ

క‌రోనా వ‌ల‌న కొన్ని నెల‌ల పాటు విహార యాత్ర‌ల‌కు దూరంగా ఉన్న సెల‌బ్స్ ఇప్పుడు అంద‌మైన ప్ర‌దేశాల‌ను ఎంచుకొని టూర్స్ వేస్తున్నారు. తాజాగా మంచు ల‌క్ష్మీ ఫ్యామాలీ మాల్దీవుల‌కు వెళ్ళింది. అక్క‌డి ప్ర‌కృతిని బాగా  ఎంజ‌య్ చేస్తున్న వీరు ఎప్ప‌టిక‌ప్పుడు టూర్స్‌కు సంబంధించిన అప్‌డేట్స్ ఇస్తున్నారు. తాజాగా త‌న కూతురు నిర్వాణ‌తో క‌లిసి దిగిన ఫొటోస్‌తో పాటు త‌న తండ్రి మోహ‌న్ బాబుతో చేసిన డిన్న‌ర్‌కు సంబంధించిన ఫొటోలు కూడా షేర్ చేసింది. డిన్న‌ర్ చేసే స‌మ‌యంలో పాత పాట‌లు వింటూ నేచ‌ర్‌ని ఎంజాయ్ చేసాం అని మంచు వార‌మ్మాయి పేర్కొంది. మాల్దీవులు టూర్ లో మంచు ల‌క్ష్మీతో పాటు కూతురు నిర్వాణ, భ‌ర్త ఆండీ శ్రీనివాసన్, తండ్రి మోహ‌న్ బాబు, త‌ల్లి నిర్మల ఉన్నారు.  ఇటీవ‌ల మోహ‌న్ బాబు, నిర్మ‌ల బీచ్ ఒడ్డున ఫొటో షూట్ చేయ‌గా, ఆ ఫొటోలు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేశాయి. 


VIDEOS

logo