‘కడప దగ్గరలోని ఎర్రగుడి అమ్మవారి నేపథ్యంలో తెరకెక్కించిన సినిమా ‘ఆదిపర్వం’. 1974-90 మధ్యకాలంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశాను. అమ్మోరు, అరుంధతి చిత్రాల తరహాలో ఈ సినిమా ఉంటుంది. మంచు లక్ష్మి ఇందులో ముఖ్యపాత్ర పోషించారు. ఆమె పాత్ర సినిమాకు హైలైట్గా నిలుస్తుంది’ అని దర్శకుడు సంజీవ్ మేగోటి అన్నారు.
సంజీవ్ మేగోటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆదిపర్వం’. మంచు లక్ష్మి, ఎస్తేర్, శివ కంఠమనేని ముఖ్యపాత్రధారులు. ఆదిత్య ఓం కీలక పాత్ర పోషించారు. రావుల వేంకటేశ్వరరావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్, ఏఐ ఎంటైర్టెన్మెంట్స్ పతాకాలపై రూపొందిన ఈ చిత్రం ఈ నెల 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు సంజీవ్ మంగళవారం విలేకరులతో ముచ్చటించారు. ఆడియన్స్కి అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ఇదనీ, తప్పకుండా అందరికీ నచ్చుతుందని, కన్నడలో కూడా సినిమా గ్రాండ్గా విడుదల అవుతున్నదని దర్శకుడు సంజీవ్ తెలిపారు.