జనతాగ్యారేజ్, మన్యం పులి సినిమాలతో తెలుగులో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ (Mohanlal). ఈ సీనియర్ హీరో ప్రస్తుతం మాన్స్టర్ (Monster) సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో టాలీవుడ్ నటి లక్ష్మీ మంచు (Manchu Lakshmi) కీలక పాత్రలో నటిస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్ డేట్ బయటకు వచ్చింది. మంచు లక్ష్మి తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం పూర్తి చేసింది.
డబ్బింగ్ థియేటర్లో దిగిన స్టిల్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఈ విషయాన్ని తెలియజేసింది. ఫిల్మ్ మేకింగ్ వర్క్ లో కష్టతరమైన పనుల్లో ఒకటి డబ్బింగ్..అంటూ క్యాప్షన్ పెట్టింది. మన్యం పులి సినిమాతో గ్రాండ్ సక్సెస్ అందుకున్న డైరెక్టర్ వైశాఖ్ (Vysakh) మరోసారి ఈ సినిమాకు పనిచేస్తున్నాడు. ఆశిర్వాద్ సినిమాస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.