హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ) : బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు మంచు లక్ష్మి హాజరయ్యారు. బుధవారం హైదరాబాద్లో గల బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయంలో మూడు గంటలపాటు ఈడీ అధికారులు మంచు లక్ష్మిని విచారించారు.
‘యోలో 247’ యాప్ ప్రచారం అంశంపై మంచు లక్ష్మి స్టేట్మెంట్ను ఈడీ రికార్డు చేసింది.