దళితుల సంక్షేమం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషి, స్ఫూర్తితో ‘మానవతా పరిమళం’ అనే డాక్యుమెంటరీని నిర్మించామని చెప్పారు సీనియర్ పాత్రికేయులు వాసిరాజు ప్రకాశం. ఈ డాక్యుమెంటరీ నిర్మాణానికి మంత్రులు మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్ సహకారం అందించారని ఆయన తెలిపారు. 30 నిమిషాల ఈ డాక్యుమెంటరీకి గడ్డం పద్మ దర్శకత్వం వహించారు. వాసిరాజు ప్రకాశం మాట్లాడుతూ…‘కుల, మత భేదాలు శాశ్వతం కాదు మానవత్వమే చిరకాలం మిగిలిపోతుంది అనే కథాంశంతో ‘మానవతా పరిమళం’ నిర్మించాం. దళితుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి మాకు స్ఫూర్తినిచ్చింది. సహకారం అందించిన మంత్రులు మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్ లకు కృతజ్ఞతలు. ఈ డాక్యుమెంటరీని జాతీయ, అంతర్జాతీయ చిత్రోత్సవాలకు పంపిస్తాం’ అన్నారు.