Salman Khan | బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan)కు సోమవారం హత్య బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్‌ను అతని నివాసంలోనే చంపేస్తామంటూ బెదిరించారు. అంతేకాదు అతని వాహనాన్ని బాంబులు పెట్టి పేల్చేస్తామని మెసేజ్ చేశారు. ఈ బెదిరింపులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తాజాగా బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని గుర్తించారు.
నిందితుడు గుజరాత్‌లోని వడోదర జిల్లాకు చెందిన 26 ఏళ్ల వ్యక్తిగా గుర్తించినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. అతడు ఓ మానసిక రోగి (mentally ill) అని పేర్కొన్నారు. అతని కుటుంబ సభ్యులను సంప్రదించగా అతను 2014 నుంచి చికిత్స తీసుకుంటున్నట్లు తేలిందన్నారు. దీంతో అతని ఆసుపత్రి పత్రాలను కూడా పరిశీలించినట్లు పోలీసులు వెల్లడించారు.
సల్మాన్ ఖాన్ (Salman Khan)కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ (gangster Lawrence Bishnoi) నుంచి వరుస హత్య బెదిరింపులు (death threats) వస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే కాలంలో సల్మాన్‌కు పలుమార్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా బెదిరింపులు వచ్చాయి. ఈ క్రమంలో సోమవారం కూడా సల్మాన్‌కు హత్య బెదిరింపులు వచ్చాయి. సల్మాన్ ఖాన్‌ను అతని నివాసంలోనే చంపేస్తామంటూ బెదిరించారు. అంతేకాదు అతని వాహనాన్ని బాంబులు పెట్టి పేల్చేస్తామని మెసేజ్ చేశారు. వర్లి రవాణా శాఖ (Worli Transport Department) అధికారిక వాట్సాప్ నంబర్‌కు ఈ బెదిరింపు మెసేజ్ వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో నిందితుడిని గుర్తించారు.
Also Read..
Salman Khan | ఇంట్లోనే చంపుతాం.. సల్మాన్‌కు మరోసారి హత్య బెదిరింపులు
Shah Rukh Khan | ఇంటి రెంట్ కట్టేందుకు డబ్బులేక ఇబ్బందులు పడ్డాను : షారుక్ ఖాన్