NTR – Rishab Shetty | టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి తారక రామారావు, కన్నడ స్టార్ నటుడు, దర్శకుడు రిషబ్ షెట్టి ఒకే చోట కలిశారు. ప్రస్తుతం దేవర షూటింగ్ కంప్లీట్ చేసుకున్న తారక్ గాయం కారణంగా రెస్ట్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే గాయం నుంచి కోలుకోక ముందే అత్యవసర పనిమీదా మంగుళూరు వెళ్లినట్టు తెలుస్తుంది.
తారక్ నేడు మంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో నడుచుకుంటూ వస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే తారక్‌తో పాటు ఎయిర్‌పోర్ట్‌లో ఇంకో స్టార్ నటుడు కూడా ఉన్నాడు. అతడే రిషబ్ షెట్టి. కాంతారతో నేషనల్ అవార్డు అందుకున్న ఈ నటుడు తారక్‌తో కలిసి ఎయిర్‌పోర్ట్‌లో వస్తున్నట్లు ఈ ఫొటోలు ఉన్నాయి. అయితే వీళ్లు ఫ్లైట్ లో క్యాజువల్ గా కలిశారా లేక ఇద్దరూ కలిసే వెళ్లారా అనేది తెలియాల్సి ఉంది. ఇక వీళ్లిద్దరూ ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో అటు తారక్ ఫ్యాన్స్‌తో పాటు ఇటు రిషబ్ ఫ్యాన్స్ పండగా చేసుకుంటున్నారు. మరోవైపు ఎన్టీఆర్ తన అమ్మమ్మ ఊరు వెళుతున్నట్లు సమాచారం. తారక్ అమ్మమ్మ వాళ్ల ఊరు మంగుళూరు దగ్గరలోని కుందాపుర. రిషభ్ శెట్టిది కూడా అదే ఊరు. దీంతో ఈ ఇద్దరికి మంచి బాండ్ ఏర్పడింది.
ఇదిలావుంటే తాజాగా కాంతారా ప్రీక్వెల్‌కు సంబంధించి ఒక సాలిడ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. రిషబ్ షెట్టికి తారక్‌తో ఉన్న రిలేషన్షిప్ వలన కాంతార ప్రీక్వెల్‌లో ఎన్టీఆర్ అతిథి పాత్రల్లో నటించబోతున్నట్లు తెలుస్తుంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Man of Masses @tarak9999 and Rishabh Shetty clicked at Mangalore Airport. pic.twitter.com/7OJZzlchCo
— Vamsi Kaka (@vamsikaka) August 31, 2024
Also Read..